Site icon NTV Telugu

ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి…

ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఎంట్ర‌న్స్ టెస్ట్ తేదీలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంజ‌నీరింగ్ ఎంట్ర‌న్స్ పరీక్ష.. ఈ నెల 19, 20, 23, 24, 25 తేదిల్లో జ‌రుగుతుంది. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ ఎంట్ర‌న్స్ పరీక్షలు సెప్టెంబ‌ర్ 3,6,7 తేదీల్లో జ‌రుగుతుంది. కంప్యూట‌ర్ ఆధారిత పరిక్ష‌ (CBT) ద్వారా ప‌రిక్ష‌లు నిర్వ‌హ‌ణ‌ జరుగుతుంది. మొత్తం 16 సెష‌న్ల‌లో పరీక్షలు నిర్వహణ ఉంటుంది.

అందులో ఇంజ‌నీరింగ్ 10, అగ్రికల్చర్, ఫార్మ‌సీ 6 సెష‌న్ల‌లో నిర్వ‌హ‌ణ‌ ఉంటుంది. ఎంట్ర‌న్స్ టెస్టుల కోసం 2,59,564 మంది అభ్య‌ర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. ఏపీ-తెలంగాణాలో 14 జోన్లలో.. 120 కేంద్రాల్లో పరీక్షా జరగనుంది. తెలుగు-ఇంగ్లీష్ రెండు భాష‌ల్లో ప్ర‌శ్న‌ ప‌త్రాలు ఉంటాయి. 160 మార్కుల‌కు మ‌ల్టిపుల్ చాయిస్ లో ప్ర‌శ్నాప‌త్రం ఉంటుంది. ఇంజ‌నీరింగ్ ఫలితాలు ఆగ‌స్టు 25న… అగ్రిక‌ల్చ‌ర్-ఫార్మ‌సీ ఫలితాలు సెప్టెంబ‌ర్ 7 విడుద‌ల చేస్తాం అని పేర్కొన్నారు.

Exit mobile version