Site icon NTV Telugu

మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదు : విపత్తులశాఖ కమిషనర్

రాగల 24 గంటల్లో వాయువ్య మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీడనం ఏర్పడనుంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడనున్నాయి. అక్కడక్కడ ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు వీస్తుండటంతో సముద్రం అలజడిగా ఉంటుంది. కావున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు అని విపత్తులశాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.

Exit mobile version