తనను డీజీపీగా ఎంపికచేసి చాలా పెద్ద బాధ్యత అప్పగించారన్నారు కే.రాజేంద్రనాథ్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. తన పై ఇంత నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు. జిల్లా స్థాయి పోలీసు అధికారులు కూడా గురుతర బాధ్యత వహించాల్సి ఉంటుంది. కింది స్థాయి సిబ్బందికి ఆ విధంగా దిశానిర్దేశం చేయాలి. ప్రజలకు పోలీసుల పై భారీ అంచనాలు ఉంటాయి. ప్రజల ధనప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు డీజీపీ.
నిరాధారమైన ఆరోపణలు సిబ్బంది పై వస్తే విచారణ చేసి వారికి రక్షణగా ఉంటాం.ఈవ్ టీజింగ్, గూండాయిజం వంటివి జరుగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాయలసీమ జిల్లాల్లో ఎర్రచందనం సమస్య ఉంది. విశాఖ లో గంజాయి సమస్య ఉంది. వీటి పై ఎక్కువగా దృష్టి పెడతాం అన్నారు. మత విద్వేషాలు రేగకుండా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల సహకారం మాకు చాలా అవసరం. మత సామరస్యాన్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
