Site icon NTV Telugu

Rajanna Dora: ‘సెటిలర్స్’ వ్యాఖ్యలపై వివాదం.. డిప్యూటీ సీఎం వివరణ

Rajanna Dora

Rajanna Dora

Rajanna Dora: సెటిలర్స్‌ అంటూ డిప్యూటీ సీఎం రాజన్న దొర చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది.. దీంతో.. ఆ కామెంట్‌పై వివరణ ఇచ్చారు.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర.. సెటిలర్స్ అనే పదం వాడడంపై వివరణ ఇస్తూ.. సెటిలర్స్ అనే సంస్కృతే మాకు లేదన్నారు.. అందరి మద్దతుతోనే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.. డిప్యూటీ సీఎంగా కూడా నియమించబడ్డాను అన్నారు.. అయితే, షెడ్యూల్ ఏరియాలో చేర్చాలన్న డిమాండ్ ను గతంలో టీడీపీనే ప్రోత్సహించిందంటూ ఫైర్‌ అయ్యారు.. గిరిజనులు అంతా నా వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం రాజన్న దొర.

Read Also: CM YS Jagan: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై సీఎం జగన్‌ సమీక్ష..

కాగా, రెండు రోజుల క్రితం విజయనగరంలో పర్యటించిన డిప్యూటీ సీఎం రాజన్న దొర సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కిన విషయం విదితమే.. సాలూరు ప్రాంతం సెటిలర్స్ వల్ల నష్టపోతుంది. చౌదరి, రెడ్లు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వారు భూములను, వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు..గడపగడపకు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సెటిలర్స్ వ్యవహారం ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తానన్నారు. సాలూరు ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించమని కోరతానన్నారు. అలా జరిగితే సెటిలర్స్ నష్టపోతారు. గిరిజనుల వద్ద బ్రతుకుతూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.. వారి కోసం వస్తున్న లారీల వల్ల రోడ్లు పాడవుతున్నాయి. సెటిలర్స్ వల్ల ఏ ప్రయోజనం లేదు. గిరిజనుల వద్ద సంపాదించుకొని అభివృద్ధికి మాత్రం సహకరించడం లేదు అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇక, అభివృద్ధి కార్యక్రమాలను బబ్లూ అనే సెటిలర్ అడ్డుకుంటున్నాడన్నారన్న రాజన్నదొర. ఇక్కడ పనిచేస్తూ అభివృద్ధి చెందుతున్న సెటిలర్లు.. ఇక్కడ తమ వల్ల రోడ్లు పాడయితే పట్టించుకోవడం లేదంటూ ఫైర్‌ అయిన విషయం విదితమే.

Exit mobile version