Pawan Kalyan: హైందవ ధర్మ పరిరక్షణ కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. రేపు (ఫిబ్రవరి 12) ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ కు బయలుదేరి వెళ్లనున్నారు. రేపటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆయన జ్వరం నుంచి కోలుకుంటుండగానే ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు అయింది.
Read Also: Blockbuster Love Tsunami : పెళ్లి తర్వాత కలిసి “తండేల్” ఈవెంట్‌కి హాజరైన నాగ చైతన్య, శోభిత..
అయితే, మూడు రోజుల పాటు దక్షిణాదిలోని పలు ఆలయాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. దీంతో పాటు గతంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి కూడా వెళుతున్నారు. ఇందులో, అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగానే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు సంకల్పించారు.