NTV Telugu Site icon

Deputy CM Pawan: రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది..

Pawan Kalyan

Pawan Kalyan

Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిని పట్టాలెక్కించే బడ్జెట్ ఇది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సంక్షేమం, సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా కేటాయింపులు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలుకి మార్గ నిర్దేశనం చేసేలా బడ్జెట్ ఉంది.. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసింది అని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమ శిక్షణతో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు తగ్గించే చర్యలు చేపట్టింది అని పేర్కొన్నారు.

Read Also: Meenakshi Natarajan : కాంగ్రెస్‌ నేతలకు కొత్త ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ క్లాస్‌

ఇక, మూలధన వ్యయాన్ని 40,636 కోట్ల రూపాయలకు పెంచడం ద్వారా మౌలిక వసతులు రాష్ట్రంలో పెరుగుతాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. 3,22,359 కోట్ల రూపాయలతో ప్రణాళికాబద్ధంగా రూపొందిన బడ్జెట్ ఇది.. సూపర్ సిక్స్ పథకాల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.