Site icon NTV Telugu

సీఎం జగన్‌కు కేసీఆర్‌ అంటే అభిమానం.. ఏపీ మంత్రి కామెంట్

Narayana Swamy

Narayana Swamy

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్‌ వార్‌ సాగుతోన్న సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నారాయణ స్వామి.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ మంచి ఆలోచన అభిమానంతో ఆంధ్రకి సహకరిస్తామన్నారు.. రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ర్టాల్లో ప్రజలు తల్లిబిడ్డలు కలిసి ఉన్నారని… సీఎం జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే అభిమానం.. కేసీఆర్‌కి కూడా జగన్‌ మీద అభిమానం ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం తీసుకురావొద్దని విజ్ఞప్తి చేసిన నారాయణస్వామి.. జగన్, కేసీఆర్‌ మధ్య విభేదాలు తీసుకురావడానికి కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణ అంటే.. ఇండియా, పాకిస్థాన్ కాదని.. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.

Exit mobile version