ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌పై మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ఇవాళ సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం… దేవుడి ఫొటో బదులు సీఎం జగన్ ఫొటో పట్టుకుని చాంబర్‌లోకి ప్రవేశించారు.. చాంబర్‌లో ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్లు చేశారు.. ఇది రెడ్ల రాజ్యం కాదు.. బడుగుల రాజ్యం.. జగన్ ప్రభుత్వంలో బడుగులకే ప్రాధాన్యం ఇస్తున్నారని.. ఇక, బడుగులకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యం చూసి.. తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదనే భావనలో రెడ్లు ఉన్నారని పేర్కొన్నారు.
Read Also: Maoists Attack: పోలీసు క్యాంపుపై మావోయిస్టుల మెరుపు దాడి
ఇక, నాకు ప్రాధాన్యం లేకుంటే తప్పు చేసిన ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేయగలిగేవాడినా..? అని ప్రశ్నించారు నారాయణస్వామి.. తప్పు చేసిన వారిని సస్పెండ్ చేస్తున్న ప్రతి సారి బాధపడుతూనే ఉంటానన్న ఆయన.. ఎక్సైజ్ సిబ్బంది ఎవరూ ప్రలోభాలకు గురి కావద్దు.. సస్పెన్షన్లు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దు అని సూచించారు. మరోవైపు.. సీఎం జగన్ ఫొటోతో చాంబర్‌లోకి ప్రవేశించడంపై స్పందించిన ఆయన.. దేవుడి లక్షణాలు కలిగిన మానవుడు సీఎం జగన్.. అందుకే ఆయన ఫొటో పట్టుకునే చాంబర్‌లోకి ప్రవేశించానన్నారు.. కాళ్లు పట్టుకుంటేనో.. కాకపడితేనో జగన్ పదవులివ్వరని.. పార్టీ కోసం పని చేసిన వారికి జగన్ గుర్తింపునిస్తారని వెల్లడించారు. ఇక, రెండోసారి పదవి దక్కుతుందని తాను ఊహించ లేదన్న నారాయణస్వామి.. సీఎం జగన్ నా మీద పెట్టిన బాధ్యతను నెరవేరుస్తానని తెలిపారు.