ఆంధ్రప్రదేశ్‌లో బోగస్ చలాన్ల వ్యవహారం సంచలనం సృష్టించింది.. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆ స్కామ్ వెనుక ఉన్నవారి బరతపడుతోంది.. బోగస్ చలానాల వల్ల పక్కదారి పట్టిన నిధులు.. రూ.7.14 కోట్లుగా గుర్తించామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. బోగస్ చలాన్ల స్కాంలో ఇప్పటి వరకు 3 కోట్ల 39 లక్షలు రికవరీ అయ్యాయన్నారు. ఇక కొత్త సాఫ్ట్ వేర్‌తోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని.. అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామన్నారు ధర్మాన. రాష్ట్రం మొత్తం మీద 11 జిల్లాల్లోని 36 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సొమ్ము పక్కదారి పట్టినట్లు గుర్తించామన్నారు ధర్మాన కృష్ణదాస్. బోగస్ చలాన్ల ద్వారా జరిగిన రిజిస్ట్రేషన్లపై ఏం చేయాలనే దానిపై న్యాయ సలహా తీసుకుంటామన్నారు.
బోగస్ చలాన్ల స్కామ్.. రూ.3.39 కోట్లు రికవరీ..

Dharmana Krishna Das