వివిధ శాఖల సెక్రటరీలతో ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ భేటీ అయ్యారు. ఆయా శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. కేంద్ర పథకాల అమలు.. కేంద్ర నిధుల వినియోగంపై చర్చించారు. సచివాలయంలో ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల హాజరుపై సీఎస్ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. సెక్రటేరీయేట్టుకు ఉన్నతాధికారులు రాకుంటే పరిపాలన గాడి తప్పుతుందని అభిప్రాయపడ్డ సీఎస్… ఉద్యోగులు క్రమశిక్షణతో ఉండాలంటే ఉన్నతాధికారులు సచివాలయానికి రావాలన్నారు. హెచ్వోడీ, క్యాంప్ ఆఫీసుల నుంచి పని చేసే విధానానికి సెక్రటరీలు స్వస్తి పలకాలని ఆదేశించారు. అలాగే సచివాలయానికి సెక్రటరీలు రావడం లేదని సీఎం వద్ద ఒకట్రోండు సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చిందన్న సీఎస్…. విమర్శలకు తావివ్వకుండా వ్యవహరించాలని సూచించారు.
వివిధ శాఖల సెక్రటరీలతో సీఎస్ ఆదిత్యనాథ్ భేటీ…
