Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Firewall 2026: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు సహకరిస్తూ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్న ఇద్దరు భారతీయ యువకులను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (APCI) విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. బీహార్‌కు చెందిన రాజ్ కుమార్ (24), ఆదిత్య పాండే (23)లుగా గుర్తించిన ఈ నిందితులను ఇండో-నేపాల్ సరిహద్దుల్లోని రక్సౌల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్-2026’ పేరిట నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో భాగంగా ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి.
సిమ్ కార్డులు, వాట్సాప్ ఓటీపీల ద్వారా నెట్వర్క్
అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు భారతీయ సిమ్ కార్డుల ఓటీపీలను (OTP) సరిహద్దు ఆవల ఉన్న పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేశారు. ఆ ఓటీపీల ఆధారంగా పాక్ ఏజెంట్లు భారతీయ నంబర్లతో కూడిన వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసుకున్నారు. సాధారణ భారతీయ నంబర్లుగా కనిపించే ఈ ఖాతాల ద్వారా భారత సైనిక సిబ్బంది, ఇతర ఉద్యోగులను సంప్రదిస్తూ నిఘా వర్గాలు అనుమానించకుండా సమాచారం రాబట్టే పన్నాగం పన్నారు. ఈ సహకారానికి ప్రతిఫలంగా నేపాల్ సరిహద్దు మార్గాల ద్వారా పాక్ ఏజెంట్ల నుంచి నిందితులిద్దరూ భారీ మొత్తంలో హవాలా రూపంలో నగదు అందుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
Also Read
- School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
- Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
- AP News: నేడు రైతుల ఖాతాల్లోకి రూ.3,125 కోట్లు.. ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ!
- YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
వైజాగ్ నేవల్ బేస్ సమాచారం లీక్?
ఈ వాట్సాప్ ఖాతాలను ఉపయోగించి విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్‌కు సంబంధించిన కీలక వివరాలను పాక్ ఏజెంట్లు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. భారత రక్షణ రంగంలో అత్యంత వ్యూహాత్మకమైన యుద్ధనౌకలు, జలాంతర్గాములు (సబ్మెరైన్లు), వాటి కదలికలకు సంబంధించిన అత్యంత రహస్య వివరాలను నిఘా వర్గాల కన్నుగప్పి సేకరించినట్లు సమాచారం.
ఇప్పటికే ఇద్దరి అరెస్ట్
ఇదే గూఢచర్యం నెట్‌వర్క్‌పై దృష్టి సారించిన APCI, గతంలోనే వైజాగ్ నావికాదళ కార్యాలయంలో సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అన్నం సాయి వరప్రసాద్‌తో పాటు మరో ఉద్యోగిని అరెస్ట్ చేసింది. వీరిని విచారించగా వెలుగుచూసిన సాంకేతిక ఆధారాలతో రాజ్ కుమార్, ఆదిత్య పాండేల పాత్ర నిర్ధారణ అయింది. పక్కా సమాచారంతో బిహార్ చేరుకున్న ప్రత్యేక బృందాలు నిందితులను పట్టుకుని విజయవాడకు తరలించాయి. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న మరికొందరి కోసం అధికారులు గాలింపు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!