Site icon NTV Telugu

ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ళ్లీ కేసులు పెరుగుతున్నాయి.  రోజువారీ కేసులు వెయ్యికి పైగా న‌మోద‌వుతున్నాయి.  తాజాగా ఏపీలో 1859 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 19,88,910కి చేరింది.  ఇందులో 19,56,627 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,688 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 13 మంది మృతిచేందారు.  రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 13,595 మంది మృతిచెందారు.  ఇక 24 గంట‌ల్లో ఏపీలో 1575 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం 2,54,53,520 క‌రోనా టెస్టులు నిర్వ‌హించారు.  తూర్పుగోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 403 క‌రోనా కేసులు న‌మోద‌వ్వ‌గా, నెల్లూరులో 225, చిత్తూరులో 233 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  

Read: ఆ వైరస్‌ల ఆట ఇలా క‌ట్టించ‌వ‌చ్చు…

Exit mobile version