CM Jagan Vontimitta Visit Cancelled: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఒంటిమిట్టలో పర్యటించాల్సి ఉంది.. కానీ, కాలికి గాయం కావడంతో ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు.. కాలినొప్పితో బాధపడుతున్నారు సీఎం జగన్.. మంగళవారం ఉదయం ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో కాలు బెణికింది.. అయితే.. సాయంత్రానికి నొప్పి తీవ్రత పెరిగింది.. గతంలోనూ ఇలానే కాలికిగాయం కావడంతో.. చాలా రోజుల పాటు ఇబ్బంది పడ్డారు ముఖ్యమంత్రి.. అయితే, తాజాగా మళ్లీ కాలినొప్పి తీవ్రం కావడంతో.. ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు.. దీంతో సీఎం వైఎస్ జగన్ ఇవాళ్టి ఒంటిమిట్ట పర్యటన రద్దు అయినట్టు అధికారులు ప్రకటించారు. కాగా, ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ రోజు సీఎం జగన్ ఒంటిమిట్ట కోదండరాముని ఆలయానికి వెళ్లాల్సి ఉంది. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాలని భావించారు. అధికారులు, పోలీసులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు.. సీఎం టూర్ షెడ్యూల్ కూడా ఖరారు చేశారు.. కానీ, కాలు బెణకడంతో పర్యటన రద్దు చేసుకున్నారు.
Read Also: Home Theatre Blast: హోం థియేటర్ పేలుడులో ట్విస్ట్.. బాంబు పెట్టి గిఫ్టుగా ఇచ్చిన పెళ్లికూతురు లవర్..