Site icon NTV Telugu

CM YS Jagan: రేపు ప్రధాని మోడీతో ఏపీ సీఎం భేటీ.. విషయం అదేనా..?

Ys Jagan

Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు.. రేపు ఢిల్లీకి వెళ్లనున్నా ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం భేటీ కానున్నట్టుగా చెబుతున్నారు.. కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి నిధుల విషయంపై చర్చిస్తారని సమాచారం.. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.. ప్రధాని మోడీతో సమావేశం తర్వాత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతోనూ సీఎం జగన్‌ సమావేశం అయ్యే అవకాశం ఉంది.. అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి హస్తిన పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

Read Also: New Districts: కొత్త జిల్లాలను ఆహ్వానించిన గవర్నర్.. సీఎంకు అభినందనలు

Exit mobile version