NTV Telugu Site icon

రేపు గవర్నర్‌ వద్దకు సీఎం జగన్.. విషయం ఇదేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో బూతుల వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది.. ఆ తర్వాత దీక్షలు, ఆందోళనలు, నిరసనలు ఇలా ఒక్కటేంటి.. బూతులు వెతికిమరీ తిట్టేస్థాయికి వెళ్లిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు హస్తిన పర్యటనకు కూడా హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో.. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీకి సిద్ధం అయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రేపు సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌తో సమావేశం కానున్నారు.. టీడీపీ నేత పట్టాభి ఎపిసోడ్, చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మరోవైపు రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం జరగనుంది.. పలు కీలక అంశాలపై చర్చించనుంది.