ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేశారు. 2021-22 వ సంవత్సరానికి వివిధ శాఖల్లో మొత్తం 10,143 పోస్టులను భర్తీ చేసేందుకు క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది జులై నెల నుంచి వివిధ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయబోతున్నారు. జులై నెలలో 1238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇక ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1,2 కి చెందిన 36 పోస్టులకు నోటిఫికేషన్ ను ఉవ్వనున్నారు. సెప్టెంబర్ నెలలో పోలీస్ శాఖలో 450 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Read: పుష్పక విమానం: ‘కల్యాణం..’ పాటను విడుదల చేసిన సమంత
అదే విధంగా అక్టోబర్ నెలలో వైద్యశాఖలో 451 పోస్టులను భర్తీ చేసేందుకు సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఇకపోతే, నవంబర్ నెలలో వైద్యశాఖలోని 5,251పారామెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. ఇకపోతే, డిసెంబర్ నెలలో 441 నర్సుల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయనున్నది. అదే విధంగా వచ్చేఏడాది జనవరిలో 240 డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఏ శాఖలో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో చెప్పడమే ఈ క్యాలెండర్ ముఖ్య ఉద్దేశ్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కోన్నారు.