NTV Telugu Site icon

CM YS Jagan: ఆడారి భౌతికకాయానికి సీఎం నివాళి, కుటుంబసభ్యులకు ఓదార్పు

Ys Jagan

Ys Jagan

విశాఖ డెయిరీ చైర్మన్‌ అడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ ఉదయం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి బయల్దేరి వెళ్లిన ఆయన.. అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి చేరుకున్నారు.. అక్కడ ఆడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు… ఆ తర్వాత తులసీరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు సీఎం జగన్.. కాగా, విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు (85) బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.. అయితే, ఆరోగ్య పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందారు.

Read Also: BJP vs BJP: ఏపీ బీజేపీలో పదవుల మార్పు కలకలం… నేతల రాజీనామాలు..!

అనకాపల్లి జిల్లా యలమంచిలికి చెందిన తులసిరావు.. 30 ఏళ్లుగా విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు భార్య, కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె పిల్లా రవికుమారి మున్సిపల్ చైర్ పర్సన్. కుమారుడు ఆనంద్ కుమార్ విశాఖ డైయిరీ వైస్ చైర్మన్ గా, విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌గా కూడా ఉన్నారు.. ఇక, యలమంచిలిలో తులసీరావు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు కుటుంబసభ్యులు.