NTV Telugu Site icon

Andhra Pradesh: గవర్నర్‌తో సీఎం భేటీ.. గంట పాటు చర్చలు..

Cm Ys Jagan Governor

Cm Ys Jagan Governor

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి.. రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను మర్యాద పూర్వకంగా కలిశారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, భారతి దంపతులు… ఇక, సుమారు గంట పాటు గవర్నర్-సీఎం మధ్య చర్చలు జరిగాయి.. సమకాలిన రాజకీయ, సామాజిక అంశాలపై లోతుగా చర్చించారు.. కొత్త జిల్లాల వ్యవస్థతో పాలన.. ప్రజలకు మరింత చేరువైనట్టు గవర్నర్ కు వివరించారు సీఎం జగన్.. నూతన జిల్లాల్లో కార్యాలయాలు అన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా, ఈ మధ్యే గవర్నర్‌లో ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే.. తన పర్యటనలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీ, మరికొందరితో సమావేశమైన విషయం తెలిసిందే.

Read Also: BJP: 2024 ఎన్నికలు.. పొత్తులపై క్లారిటీ ఇచ్చిన సోము వీర్రాజు