Site icon NTV Telugu

AP: గవర్నర్‌తో అరగంటకు పైగా సీఎం చర్చలు

Governor Biswabhusan

Governor Biswabhusan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌తో సమావేశం అయ్యారు.. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని తాడేపల్లి చేరుకున్న సీఎం జగన్‌.. ఇవాళ సాయంత్రం రాజ్‌భవన్‌ వెళ్లి గవర్నర్ విశ్వభూషణ్‌తో భేటీ అయ్యారు.. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై పూర్తి వివరాలను వెల్లడించారు.. ఈ నెల 11న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్‌కి తెలిపిన ఆయన.. అదే రోజు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు. ఇందుకు సంబంధించి నూతన మంత్రుల జాబితా రెండు రోజుల్లో అందజేయనున్నట్లు వెల్లడించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశాలను గవర్నర్‌కు వివరించి.. ఈ నెల 11వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అపాయింట్‌మెంట్‌ ఖరారు చేయాల్సిందిగా కోరారు.. ఇక, ఈభేటీలో మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణతో పాటు పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటు విషయాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్‌.. గవర్నర్‌కు వివరించినట్టుగా తెలుస్తోంది.. మరోవైపు, ఏపీ పాత కేబినెట్‌ రేపు సమావేశం కానుంది.. సాయంత్రం 3 గంటలకి కేబినెట్‌ భేటీ ప్రారంభం కానుంది.

Exit mobile version