NTV Telugu Site icon

YS Jagan Delhi tour: సీఎం జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. విమానంలో సాంకేతిక లోపంతో మారిన ఢిల్లీ షెడ్యూల్‌..

Ys Jagan

Ys Jagan

YS Jagan Delhi tour: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.. ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఢిల్లీ పర్యటన కోసం బయల్దేరిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సాయంత్రం 5.03 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది.. అయితే, కొద్దిసేపటికే ఆ విమానంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి.. దీంతో.. సాయంత్రం 5.27 గంటల ప్రాంతంలో తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్‌ చేశారు. దీంతో.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు సీఎం.. ఇక, రేపు ఢిల్లీ వేదికగా కీలక సమావేశం ఉన్న నేపథ్యంలో.. ఇవాళ రాత్రికి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు సీఎం..

Read Also: Health Tips: వేరుశనగతో అందం.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..

విమానంలోని ఏసీ వాల్వ్‌లో లీకేజి కారణంగా ప్రైజరైజేషన్‌ సమస్య వచ్చినట్టు గుర్తించారు.. ఆ సమస్యను గుర్తించిన పైలట్‌ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి మళ్లించారు. అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.. అయితే, సమావేశానికి ఉన్న ప్రధాన్యత దృష్ట్యా.. సీఎం ఢిల్లీ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు అధికారులు.. ఇవాళ రాత్రికి 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు.. ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్నారు.. ఇవాళ రాత్రికే ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌ వెళ్లనున్నారు.. రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరి హస్తినకు వెళ్తారు.. సీఎంతో పాటు విమానంలో సీఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్తారు. రేపు దౌత్యవేత్తలతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ – కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగనుంది.. దీని కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు సీఎం వైఎస్‌ జగన్.. షెడ్యూల్‌ ప్రకారం.. ఇవాళ రాత్రికి హస్తినకు చేరుకోనున్న ఆయన.. కాగా, రేపు ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు చేరుకుంటారు సీఎం.. అక్కడ పలు దేశాల దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.. ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది.. సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం జగన్‌.. రేపు రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి నివాసం చేరుకుంటారు. ఇక, మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగనున్న విషయం విదితమే..

Show comments