NTV Telugu Site icon

CM Jagan: దావోస్‌లో ఏపీ సీఎం.. రెండోరోజు షెడ్యూల్‌ ఇదే..

Ys Jagan

Ys Jagan

దావోస్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్.. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆయన.. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వరుసగా భేటీలు అవుతున్నారు.. ఇక, రెండో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు సీఎం జగన్‌.. ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అంశంపై ఇవాళ డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్‌ సెషన్‌లో మాట్లాడనున్నారు.. స్విస్‌ కాలమానం ప్రకారం ఉదయం 8:15ల కు సెషన్‌ ప్రారంభం కానుంది..

Read Also: Gold Price: పసిడి ధరలు ఈ రోజు ఇలా..

ఇక, ఆ తర్వాత టెక్‌ మహీంద్రా ఛైర్మన్, సీఈవో సీపీగురానీతో భేటీ కానున్నారు ఏపీ సీఎం జగన్.. దస్సాల్ట్‌ సీఈవో బెర్నార్డ్‌ ఛార్లెస్‌తో సమావేశం కాబోతున్నారు.. జపాన్‌కు చెందిన ప్రముఖ రవాణా సంస్థ మిట్సుయి ఒ.ఎస్‌.కె.లైన్స్‌ లిమిటెడ్‌ సీఈవో తకేషి హషిమొటోతో సమావేశం కానున్నారు.. హీరో మెటార్‌ కార్పొరేషన్‌ సీఎండీ పవన్‌ ముంజల్‌తోనూ చర్చించనున్నారు.. ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్‌ కృష్ణను కలవబోతున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. కాగా, తొలి రోజు పర్యటనలో.. డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాజ్‌ ష్వాప్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడినట్టు అయ్యింది..