NTV Telugu Site icon

CM YS Jagan at Jayaho BC Maha Sabha: మాటలతో కాదు.. చేతుల్లోనే ఒక విప్లవం తీసుకొచ్చాం..

Cm Jagan

Cm Jagan

రాజకీయ సాధికారతలో అధికారంలో వాటా ఇవ్వటం అంటే ఏంటో చూపించాం.. మాటలతో కాదు చేతుల్లోనే ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చాం.. ఆ విప్లవం ఇక్కడే ప్రత్యక్షంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వేదికగా జరిగిన జయహో బీసీ మహాసభలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తొలి కేబినెట్‌లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం కల్పించాం.. రెండో దఫాలో ఏకంగా 70 శాతం మంది ఈ వర్గాలవారే ఉన్నారని గుర్తుచేశారు.. కానీ, చంద్రబాబు కనీసం ఒక్క బీసీని అయినా రాజ్యసభకు ఎందుకు పంపించ లేకపోయారు? అని నిలదీశారు.. ఇంటికో ఉద్యోగం అని చెప్పి యువతను చంద్రబాబు మోసం చేశాడని విమర్శించిన ఆయన.. కానీ, మేం 46 వేల ఉద్యోగాలు ఆరోగ్య రంగంలో ఇచ్చాం.. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ తీసుకుని వచ్చింది మన ప్రభుత్వం అన్నారు.. విద్యా, మహిళా సాధికారత తీసుకుంటే దేశంలో ఏ రాష్ట్రం దరిదాపుల్లో లేదు.. నవ రత్నాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతి కోసమేనని.. 31 లక్షల ఇళ్ళ పట్టాల్లో 16 లక్షలకు పైగా ఇళ్ళ పట్టాలు బీసీ మహిళలకే ఇచ్చాం.. వీటి విలువ లెక్కేస్తే రెండు లక్షల కోట్ల రూపాయలు మహిళల చేతుల్లో పెట్టినట్లు అవుతుందని వెల్లడించారు సీఎం వైఎస్‌ జగన్‌.

నా వెనుక ఉన్న నలుగురు మీరే అని ప్రకటించారు సీఎం జగన్.. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయ్యింది.. నా వయసు 49 ఏళ్ళు.. ఇంత కాలం రాజకీయాల్లో ఉన్నా 2024లో ఒంటరిగా పోటీ చేస్తాను అని చెప్పలేకపోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు.. చంద్రబాబు ఎందుకు దుష్టచతుష్టయం మీద ఎందుకు ఆధారపడుతున్నారు అంటూ ప్రశ్నించారు.. ఎందుకంటే ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదు కనుకే అని ఎద్దేవా చేసిన ఆయన.. ఈ మూడున్నర ఏళ్ళల్లో నా బీసీ, మైనారిటీ వర్గాలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చామన్నారు.. ప్రతి పార్టీకి ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఉంటుంది, అది పార్టీ మ్యానిఫెస్టోలో ప్రతిఫలిస్తుంది.. వైసీపీ మ్యానిఫెస్టో ఆత్మ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు.. ఐదు రకాల సాధికారతలను ముందు పెట్టుకుని ఈ మూడున్నర ఏళ్ళల్లో అడుగులు వేశాం.. అవి 1. ఆర్ధిక సాధికారత, 2. రాజకీయ సాధికారత, 3. సామాజిక సాధికారత, 4. మహిళా సాధికారత, 5. విద్యా సాధికారత అని వెల్లడించారు..

ఆర్ధిక సాధికారతలో భాగంగా డీబీటీ, నాన్- డీబీటీల ద్వారా సంక్షేమం అందించాం.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు 3,19,000 లక్షల కోట్లు సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా అందించాం.. దీనిలో 2,50,358 లక్షల కోట్లు వెనుకబడిన వర్గాల కోసమే ఖర్చు చేశాం అన్నారు సీఎం వైఎస్ జగన్.. అంటే 80 శాతం పేద, సామాజిక వర్గాల కోసమే ఖర్చు చేశామన్న ఆయన.. 2018-19 చంద్రబాబు ఆఖరి సంవత్సరం అన్నారు.. 2018-19 బడ్జెట్, ఇప్పటి బడ్జెట్ ఒకటే.. అప్పుడు అప్పుల్లో పెరుగుదల రేటు 19 శాతం అయితే.. ఇప్పుడు అప్పుల్లో పెరుగుదల రేటు 15 శాతం అని.. మరి ఎందుకు ఇన్ని సంక్షేమ పథకాలు లేవు అని ప్రశ్నించారు.. అప్పుడు బడ్జెట్ అంతా నలుగురి జేబుల్లోకి వెళ్ళేది.. దోచుకో, పంచుకో, తినుకో పథకం అని ఫైర్‌ అయ్యారు.. అప్పుడు చంద్రబాబు బీసీ కులాల తోకలు కత్తిరిస్తా అన్నాడు.. ఎస్సీగా పుట్టాలని ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అనేవాడని విమర్శించారు. ఇవాళ బడ్జెట్‌లోనే కాదు నా గుండెల్లో సామాజిక కులాలకు చోటు కల్పించాం.. పాదయాత్రలో బీసీల ఆకాంక్షలను తెలుసుకున్నా.. మన ఇంట్లో ప్రతి వస్తువు బీసీలు తయారు చేసేవే.. నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలన్న ఆయన.. చంద్రబాబు కనీసం ఒక్క బీసీని అయినా రాజ్యసభకు ఎందుకు పంపించ లేకపోయారు? అంటూ నిలదీశారు సీఎం వైఎస్‌ జగన్.

Show comments