Site icon NTV Telugu

AP 3Capitals : హైకోర్టు తీర్పుతో.. జగన్‌ సమీక్షా..

ఏపీలో 3 రాజధానులు అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని తన తీర్పులో స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజధాని అంశంలో చట్టాలు చేసే హక్కు అసెంబ్లీకి లేదని వెల్లడించింది. దీంతో హైకోర్టు తీర్పుపై వైసీపీ మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించబోతున్నారు.

హైకోర్టు తీర్పుపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిపుణులు, ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమీక్షలో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సమీక్ష అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన మీడియాకు వివరించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొందరు రాజకీయ ప్రముఖులు హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. మరికొందరు సీఎం జగన్‌ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని మానుకోవాలని.. హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని అన్నారు.

Exit mobile version