NTV Telugu Site icon

బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు ఏవి?.. ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ

కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఏపీ సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. బడ్జెట్‌లో ఏపీకి ప్రత్యేక కేటాయింపులు లేకపోవడాన్ని లేఖలో ప్రశ్నించారు. అంతేకాకుండా ఏపీలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను లేవనెత్తుతూ సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. ‘విభజన తర్వాత రాష్ట్ర ఆదాయం భారీగా కోల్పోయింది. రాష్ట్రాన్ని కేంద్ర సహకారం చాలా అవసరం. పోలవరం నిధులు, రెవెన్యూ లోటు సహా ఇతర అంశాలకు పరిష్కారం చూపించండి’ అంటూ ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు.

Read Also: ఏపీలో ఈ నెలాఖరు నాటికి వైద్యశాఖలో 30వేల ఖాళీలు భర్తీ

మరోవైపు ఐదురోజుల కిందట కూడా ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాల నుంచి కేంద్రానికి డిప్యూటేషన్‌పై పంపించే ఐఏఎస్ అధికారుల అంశంలో సవరణలు తీసుకొస్తున్న కేంద్రం చొరవను సదరు లేఖలో జగన్ అభినందించారు. అయితే రాష్ట్రాలు నిరభ్యంతర పత్రాలు విడుదల చేసిన తర్వాతే డిప్యూటేషన్ ఖరారవుతున్న ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని కేంద్రానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. డిప్యూటేషన్‌పై వచ్చే ఐఏఎస్ అధికారి రిపోర్ట్ చేసే గడువును నిర్ణయించే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణపై సీఎం జగన్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే.