ఈనెల 27న ఏపీ సీఎం జగన్ ప్రకాశం జిల్లా వెళ్లనున్నారు. ఈ నెల 27న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె రిసెప్షన్ కార్యక్రమం ఎర్రగొండపాలెంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు సీఎం జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. సీఎం రాక సందర్భంగా ఎర్రగొండపాలెంలో భద్రతా ఏర్పాట్లను ఈరోజు పోలీసులు పరిశీలించారు.
Read Also: మంత్రి అనిల్ కి బండ్ల మార్క్ పంచ్..
ఇందులో భాగంగా హెలీప్యాడ్, వీఐపీ గ్యాలరీలు, వాహనాల పార్కింగ్ ప్రాంతం, రిసెప్షన్ జరిగే వేదికను జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు, బారికేడ్లలను ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. కాగా ఈనెల 17న హైదరాబాద్‌లో మంత్రి సురేష్ కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
