Site icon NTV Telugu

హస్తినలో సీఎం జగన్.. నేడు కేంద్రమంత్రులతో వరుస భేటీలు

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా ఉన్నారు. సోమవారం నాడు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన సీఎం జగన్… మంగళవారం నాడు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఉదయం 9:30 గంటలకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం జగన్ భేటీకానున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో జగన్ సమావేశం కానున్నారు.

Read Also: బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది

ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సీఎం జగన్‌ సమావేశమవుతారు. అయితే ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా జగన్ కలుస్తారని తెలుస్తోంది. కేంద్రమంత్రులతో వరుస భేటీల అనంతరం ఆయన ఏపీకి తిరిగి రానున్నారు.

Exit mobile version