CM Jagan: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం జగన్ క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ భేటీలో ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలను సీఎం జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఏపీకి చెందిన పలువురు మంత్రుల హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నా.. మంత్రులు స్పందించడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. మంత్రులు తీరు మార్చుకోకపోతే కేబినెట్‌లో మార్పులు తప్పవని జగన్ హెచ్చరించారు. తేడా వస్తే ఇద్దరు, ముగ్గురిని తప్పించడానికి వెనకాడనని జగన్ అన్నట్లు సమాచారం అందుతోంది. ప్రభుత్వం అంటే అందరి బాధ్యత అని.. నాకేం పట్టిందని వ్యవహరించడం సరికాదని సీఎం జగన్ హితవు పలికారు.
Read Also: ‘Fine’ Apple: ‘యాపిల్’కి జరిమానా. ఏ మోడల్ ఫోన్లూ అమ్మొద్దంటూ ఆ దేశం నిర్మొహమాటంగా ఆదేశం
మరోవైపు ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సచివాలయంలో 85 కొత్త పోస్టులను ప్రమోషన్‌ల ద్వారా భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం పలికింది. ఏపీలో రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం పలికింది. గ్రీన్ ఎనర్జీలో రూ.81వేల కోట్ల పెట్టుబడులకు, భావనపాడు పోర్టు విస్తరణకు, దివ్యాంగులకు 4 శాతం ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్‌లకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది.