ఏపీ సీఎం జగన్ ఈనెల 23న తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం అధికారికంగా విడుదల చేసింది. ఈనెల 23న ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా బయలుదేరి ఉదయం 11 గంటలకు తిరుపతి రూరల్ మండలం పేరూరు చేరుకోనున్నారు. ఉదయం 11:15-11:45 గంటల వరకు శ్రీ వకుళామాత ఆలయ ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలలో సీఎం జగన్ పాల్గొంటారు.
అనంతరం సీఎం జగన్ మధ్యాహ్నం 12:05 గంటలకు శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు చేరుకుంటారు. అక్కడ రూ. 700 కోట్ల పెట్టుబడితో హిల్‌టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్ నిర్మాణ పనుల భూమి పూజ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఏర్పేడు మండలం వికృతమాలలో ఈఎంసీ 1 పరిధిలోని టీసీఎల్ పరిశ్రమ వద్దకు సీఎం జగన్ చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపన కార్యక్రమాల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3:50 గంటలకు సీఎం జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లాండ్ అదనపు ఎస్పీ కులశేఖర్, ఇంటెలిజెంట్ అడిషనల్ ఎస్పీ స్వామి. ఆర్డీవో కనక నర్సారెడ్డి, వెస్ట్ డీఎస్పీ నరసప్ప, ట్రాఫిక్ డీఎస్పీ కాటంరాజు, ఏఆర్ డీఎస్పీ నందకిషోర్, ఎంఆర్ పల్లి సీఐ సురేంద్ర నాథ్ రెడ్డి, ఆర్ఐలు రెడ్డప్ప రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు.