NTV Telugu Site icon

ఆ బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలి : సీమ్ జగన్

cm jagan

cm jagan

ఇరిగేషన్‌పై సీఎం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఇందులో… పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రగతిని సీఎంకు వివరించారు అధికారులు. అలాగే స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల్లో 91 శాతం పూర్తయ్యాయి. జూన్‌ 15 కల్లా మిగిలిన పనులు పూర్తిచేస్తామని… ఈనెలాఖరు కల్లా స్పిల్‌ ఛానల్‌ పనులు పూర్తవుతాయని వెల్లడించారు అధికారులు. ఇక వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం ఆధీశించారు. నేరడి బ్యారజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని తెలిపారు. అయితే ఇప్పటికే చర్చలకు ఒడిశా సీఎస్‌కు లేఖరాశామని, వారి స్పందన కోసం ఎదురుచూస్తున్నామన్న సీఎస్‌… త్వరలోనే నేరడి బ్యారేజీకి సంబంధించి ఒడిశాతో మాట్లాడతామన్నారు.

ఇక నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జులై 31 నాటికి పూర్తవుతాయని వెల్లడించిన అధికారులు.. సంగం బ్యారేజీ పనులు 84శాతం పనులు పూర్తయ్యాయని, జులై 31 నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారు. అలాగే అవుకు టన్నెల్‌లో రెండువైపుల నుంచి పనులు చేస్తున్నామన్న అధికారులు… ఇంకా 180 మీటర్ల పని ఉంది.. దానిని వచ్చే మూడు నెలల్లో పనులు పూర్తిచేయగలుగుతామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో టన్నెల్‌–1 పూర్తిగా సిద్ధమైందన్న అధికారులు… టన్నెల్‌ –1 హెడ్‌రెగ్యులేటర్‌పనులు కూడా దాదాపుగా పూర్తయ్యాయని వివాటించారు. అయితే టన్నెల్‌ –2 పనులు వేగవంతం చేయాలని… యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలన్న సీఎం వచ్చే సమావేశానికి కార్యాచరణ ప్రణాళికతో రావాలని ఆదేశించారు.