Site icon NTV Telugu

ప్రధానమంత్రి మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ

YS Jagan

కరోనా వ్యాక్సినేషన్‌ కొరత నేపథ్యంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరగడం లేదనే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు. జూన్ 21 నుంచి దేశంలో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ లో 25 శాతం కోటాను ప్రైవేటు హాస్పిటళ్ళకు కేంద్రం కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేటు హాస్పిటళ్ళ ద్వారా వ్యాక్సినేషన్ కు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపించటం లేదని లేఖలో వెల్లడించారు ఏపీ సీఎం.

read also : రీ-సర్వే, ఇళ్ల పట్టాల పంపిణీలో సమస్యలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్

రాష్ట్రంలో ఇప్పటి వరకు 2, 67,075 మంది మాత్రమే ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సిన్ వేయించుకున్నారని స్పష్టం చేశారు సీఎం జగన్. త్వరగా అందరికీ వ్యాక్సిన్ వేయాల్సిన ఉన్న నేపథ్యంలో ప్రైవేటు హాస్పిటళ్ళల్లోని మిగులు డోసులను ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పంపిణీకి అవకాశం కల్పించాలని సీఎం జగన్‌ కోరారు.

Exit mobile version