Site icon NTV Telugu

Andhra Pradesh: ‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

Mekapati

Mekapati

Andhra Pradesh:  అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో దివంగత నేత మేకపాటి గౌతమ్‌ రెడ్డిపై రచించిన ‘చిరస్మరణీయుడు’ పుస్తకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి చిరస్మరణీయుడు పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా గౌతమ్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను సీఎం జగన్ నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి, రచయిత డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారథి పాల్గొన్నారు.

Read Also: Lunar Eclipse: రేపు చంద్రగ్రహణం.. కార్తీక పౌర్ణమి ఎప్పుడు జరుపుకోవాలి?

కాగా ఏపీలో పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖల మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మరణించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ వారసత్వంతో వైసీపీలో చేరిన గౌతమ్ రెడ్డి స్వల్పకాలంలోనే కీలక స్థానానికి ఎదిగారు. ఏపీ సీఎం జగన్ సన్నిహితుల్లో ఆయన ఒకరు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో రెండోసారి కూడా ఆత్మకూరు నుంచి గెలవగానే ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కింది.

Exit mobile version