CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. “పూర్వోదయ” పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. దేశంలోని తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం “పూర్వోదయ”పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్ర ప్రభుత్వం.. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఎంపిక చేసింది.
Read Also: Sarpanch Eligibility: గ్రామ సర్పంచ్‌గా పోటీ చేయాలి అనుకుంటున్నారా? ఉండాల్సిన అర్హతలు ఇవే..
అయితే, “పూర్వోదయ” పథకం యొక్క నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు వివరించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వాల్సిన నిధులపై చర్చించారు. దీంతో పాటు రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్‌ను మరింతగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు.
