NTV Telugu Site icon

చంద్రబాబు, నారాయణకు సీఐడీ షాక్..

టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.
అసైన్డ్ భూముల జీవో కేసులో చంద్రబాబుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలంది సీఐడీ. ఈ మేరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ. అమరావతిలో అసైన్డ్ భూముల కోసం చట్ట వ్యతిరేకంగా జీఓ 41 తీసుకువచ్చారన్న సీఐడీ..ఈ జీవో ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిషేధ చట్టం, ఏపీ సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొంది. చంద్రబాబు పిటిషన్ కొట్టేయాలని కోరింది సీఐడీ. అసైన్డ్ భూముల విషయంలో చంద్రబాబు, నారాయణపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుపై ఇప్పటికే కేసు నమోదు చేసిన సీఐడీ..కోర్టు ఆదేశాలతో కౌంటర్ దాఖలు చేసింది సీఐడీ.