AP CID: అంతర్జాతీయ సైబర్ క్రైమ్ గ్యాంగ్ ముఠా కేసులో ఏపీ సీఐడీ కీలక పురోగతి సాధించింది. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి 1400 సిమ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్ వర్క్ ను ఏపీ సీఐడీ ఛేదించింది.
Read Also: Road Accidents: దక్షిణాదిలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. తమిళనాడు, కర్ణాటకలో 20 మందికి పైగా మృతి
అయితే, వియత్నాం దేశానికి చెందిన హో హుడే యువకుడిని వెస్ట్ బెంగాల్ లో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ నేరాలకు వినియోగిస్తున్న 1400 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కంబోడియా నుంచి వైజాగ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా కేంద్రంగా సైబర్ క్రైమ్ నేరాలకు సిమ్ బాక్స్ లు ఆపరేట్ చేస్తున్నారు నేరగాళ్లు. ఇక, సిమ్ బాక్స్ ల ద్వారా సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్న భారీ నెట్ వర్క్ ను సీఐడీ గుర్తించింది.
