NTV Telugu Site icon

ఏపీ కరోనా అప్డేట్ : 24 గంటల్లో 118 మృతి

AP COVID 19

ఏపీలో క‌రోనా సెకండ్‌వేవ్ క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది.. మొన్న త‌గ్గిన‌ట్టే త‌గ్గిన కొత్త కేసులు.. క్ర‌మంగా నాలుగు రోజుల నుంచి మ‌ళ్లీ పెరుగుతున్నాయి.. గ‌డిచిన 24 గంట‌ల్లో 19,981 కొత్త పాజిటివ్ కేసులు న‌మోదు కాగా…118 మంది మృతి చెందారు. ఇదే స‌మ‌యంలో 18,336 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్తాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060 కి చేరుకోగా.. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,10,683 గా ఉంది. కోవిడ్ బారిన‌ప‌డి మృతి చెందిన‌ వారి సంఖ్య10,022 కు పెరిగింది. ఇక ఏపీలో మొత్తం 13,41,355 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు.