ఏపీ కరోనా అప్డేట్.. తగ్గిన కేసులు

AP COVID 19

AP COVID 19

ఏపీ లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత కిందకు దిగింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 57,745 శాంపిల్స్ పరీక్షించగా.. 1085 మందికి పాజిటివ్‌ గా తేలింది.. మరో 08 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 1541 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్‌ టెస్ట్‌ల సంఖ్య 2,60, 91, 962 కు పెరగగా… మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,02,340 కు చేరింది. ఇప్పటి వరకు 19,73, 940 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక, కోవిడ్‌ బారినపడి మృతిచెందినవారి సంఖ్య 13,723 కు పెరగగా.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 14, 677 కు చేరుకున్నాయి.