Site icon NTV Telugu

ఏపీ కరోనా అప్డేట్‌… ఇవాళ ఎన్నంటే ?

COVID 19 AP

COVID 19 AP

ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 88,378 సాంపిల్స్ పరీక్షించగా.. 3042 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 28 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 3,748 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.

read also : బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కేసీఆర్ ఆలోచించాలి : ఎమ్మెల్సీ డొక్కా

ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,08, 065 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 18,61,937 కి చేరింది.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 12,898 మంది మృతి చెందితే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 33,230 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. నేటి వరకు 2,25,24,187 సాంపిల్స్‌ పరీక్షించామని బులెటిన్‌లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

Exit mobile version