బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కేసీఆర్ ఆలోచించాలి : ఎమ్మెల్సీ డొక్కా

గుంటూరు : జల వివాదంపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. రాష్ట్రం విడిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా.. అప్పుడు లేని నీటి సమస్య ఇప్పుడు ఎందుకు తెస్తున్నారని.. బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో కేసీఆర్ ఆలోచించాలని కోరారు. నీటి పారుదల శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని…రైతాంగానికి ఆయన అనేక సేవలందించారని పేర్కొన్నారు.

read also : ఇంగ్లాండ్‌ క్రికెట్‌ టీంలో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ నీటిని తోడి విద్యుత్ ఉత్పాదన పేరుతో సముద్రపు పాలు చేస్తున్నాడని మండిపడ్డారు. సాగునీటికి, తాగునీటికి వాడిన తర్వాత విద్యుత్ ఉత్పాదనకు వాడాలని… కృష్ణా జలాలే లేకపోతే తాగునీటికి, సాగునీటికి సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కారం చేస్తారని పేర్కొన్నారు. న్యాయపరంగా చట్టపరంగా.. రాజ్యాంగం ప్రకారం నీటి సమస్యను పరిష్కారం చేసుకోవాలని… ఇరు రాష్ట్రాలు కలిసి మెలిసి ఉండే విధంగా కెసిఆర్ నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-