Site icon NTV Telugu

Cm Chandrababu : రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ మీటింగ్

Cm Chandrababu

Cm Chandrababu

Cm Chandrababu : సీఎం చంద్రబాబు అధ్యక్షుతన రేపు ఏపీ కేబినెట్ సమావేశం కాబోతోంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులతో సమావేశం నిర్వహిస్తారు సీఎం చంద్రబాబు. ఈ మీటింగ్ లో కీలక అంశాలు చర్చకు రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా అమరావతి కోసం సీఆర్డీఏ కింద రూ.37,072 కోట్ల టెండర్ల పనులపై చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ ఎంఈ పార్కుల నిర్మాణంపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇవే కాకుండా సూపర్ సిక్స్ లో అమలు చేయాల్సిన వాటిపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read Also : Srikanth Addala : ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో చిన్నోడు పూల కుండీ అందుకే తన్నాడు

Exit mobile version