AP Cabinet: నేడే ఏపీ కేబినెట్.. పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక చర్చ!

  • నేడు మధ్యాహ్నం మూడు గంటలకి ఏపీ కేబినెట్..
  • సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపననన్న కేబినెట్..
  • పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం..
  • SIPB ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్..
  • సీఆర్డీఏ ప్రతిపాదనల్లో కీలక అంశంగా ఆర్ 5 జోన్..
Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఈరోజు ( ఫిబ్రవరి 24న) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈ మీటింగ్ లో సీఆర్డీయే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, పలు సంస్థలకు భూ కేటాయింపు లపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఆమోదం లభించే ఛాన్స్ ఉంది. సీఆర్డీయే ప్రతిపాదనల్లో కీలక అంశంగా ఆర్ 5 జోన్.. ఈ ఆర్ 5 పేరుతో గత ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు.. రాజధాని అమరావతిలో R-5 జోన్ రద్దు చేస్తూ ప్రస్తుతం సీఆర్డీయే కీలక నిర్ణయం తీసుకుంది. 1,402.58 ఎకరాల భూమిని తిరిగి సీఆర్డీయేకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. R-5 జోన్ లో గత ప్రభుత్వం వేసిన లే-ఔట్లు, భూ పంపణీని రద్దు చేసిన సీఆర్డయే అథారిటీకి ఏపీ కేబినెట్ అప్పగించే ఛాన్స్ ఉంది.

Read Also: Vishwambhara: ఉగాదికి మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సరికొత్త గ్లింప్స్‌తో వస్తున్న వశిష్ట!

అలాగే, గత ప్రభుత్వ హయంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సుమారు 50 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. R- 5 జోన్ తో మొత్తం రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ కు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కేబినెట్ సమావేశం తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రలతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే, తిరుమల లడ్డు, కల్తీ పాలపై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది.