Buggana Rajendranath: చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా ఆ లోటు ఉంటుంది..
- సూపర్ సిక్స్ లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు..
- ఇచ్చిన హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలం..
- ప్రజలకు ఆశపెట్టి, మధ్యపెట్టి ఓటు వేయించుకుని మోసం చేశారు..
- చంద్రబాబు ఎప్పుడు పీఠం ఎక్కినా రెవెన్యూ లోటు ఉంటుంది: బుగ్గన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buggana Rajendranath: ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. గవర్నర్ ప్రసంగంలో సూపర్ సిక్స్ గురించి ఒక్క చోట కూడా చెప్పలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు.. మిర్చి గత ఏడాది 21 వేల వరకు అమ్మితే ఇప్పుడు 8 నుంచి 10 వేల వరకు మాత్రమే ఉంది.. రైతులకు అన్నదాత సుఖీభవ మాత్రం రాలేదు.. మిమ్మల్ని నమ్మిన ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.. మా ప్రభుత్వంలో మొత్తం అన్నీ కలిపి 6.31 లక్షల ఉద్యోగాలు కల్పించాం.. ఈసారి బడ్జెట్ ప్రతిని మొత్తం గ్రాఫిక్స్ తో నింపేశారని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తుంది.. ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం మీదే ఎందుకు మాట్లాడుతున్నారు.. బడ్జెట్ ప్రసంగంలో 25 సార్లు గత ప్రభుత్వం అని 10 సార్లు విధ్వంసమని మాట్లాడారు.. ఉన్నది ఒక్కటే ప్రతిపక్ష పార్టీ.. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వం అన్నారు.. మీరు సుపరిపాలన చేయాలి కదా అని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు.
Read Also: Purandeswari: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్..
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్‌తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
ఇక, చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జీతాలు సరిగ్గా రావు అని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. చంద్రబాబును ఓ చాణక్యుడు, కౌటిల్యుడు అని పోల్చారు.. మరి నాకు తెలిసి ఆయనకు ఏదీ సూట్ కాదు.. ఈసారి బడ్జెట్ కూడా సిస్టమాటిక్ గా పొందుపరచలేదు.. బడ్జెట్ బుక్ కలర్ ఎక్కువగా కంటెంట్ తక్కువగా ఉందని సెటైర్లు వేశారు. మాది ఒకటే సిద్ధాంతం.. వైఎస్ఆర్ ది, జగన్ ది.. సింపుల్ లివింగ్.. సింపుల్ థింకింగ్ సిద్ధాంతం అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం గత ఐదేళ్ల పాలనను హేళన చేయటంతోనే సరిపోతుంది.. మేము అన్నీ డీబీటీ ద్వారానే చేశాం.. మమ్మల్ని ఇంత క్రిటిసైజ్ చేసి ఏదో జరిగిపోతుందని చెప్పి జనాల్ని నమ్మించారు.. మేము చెప్పింది చేయాలని భావించి కొన్ని చెప్పలేదు.. మీరు గెలవటానికి.. మేము ఓడటానికి అబద్ధాలే కారణం అని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Virat Kohli: కొత్త మైలురాయికి దగ్గర్లో కోహ్లీ.. సచిన్ రికార్డు బద్దలే
అయితే, మీ పాలనలో ప్రజలు అభద్రతాభావంతో బ్రతుకుతున్నారు అని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇవాళ గ్రామాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.. ప్రతీ ఇంట్లో వీళ్ళు ఇచ్చిన హామీ పత్రాలు తీసుకుని మోసపోయారు.. గ్రామాల్లో ప్రజలు అప్పులపాలయ్యారు.. సంపద సృష్టి ద్వారా మీరు గెలిస్తే ఓకే.. కానీ చెప్పినవన్నీ అబద్ధాలు.. మేము కోవిడ్ లో కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశాం.. గత బడ్జెట్ లో చెప్పిన పెట్టుబడి సాయం ఎవరికైనా అందిందా అని అడిగారు. సూపర్ సిక్స్ లో చెప్పిన విధంగా ఒక్క గ్యాస్ సిలెండర్ తప్ప ఏమీ ఇవ్వలేదు.. జగన్ మ్యానిఫెస్టోను భగవద్గీతలా భావించాలని చెబుతారు.. రైతులకు ఏపీ ప్రభుత్వం తరఫున ఇరవై వేలు ఇస్తామని చెప్పారు.. ఇప్పుడు కేంద్ర నిధులతో కలిపి ఇస్తామంటున్నారు.. స్థూల ఉత్పత్తి విషయంలో అర్థం కానీ లెక్కలు చెబుతున్న చంద్రబాబు.. సంపద సృష్టించారు.. మీది అసలే డబుల్ ఇంజిన్ సర్కార్.. పేదలకు అన్నీ ఇవ్వొచ్చు కదా అని వైసీపీ నేత బుగ్గన ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!