రాజమండ్రిలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ… దేశ చరిత్రలో తొలిసారి విద్యలో 10 శాతం ఇ.బి.సి, 27 శాతం ఒ.బి.సి రిజర్వేషన్లు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై అన్ని ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నాం అని చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలపై కేంద్రం జారీ చేసిన గెజీట్ తో కేసీఆర్ నోటికి తాళం పడింది. నదీ జలాల్లో కేంద్రం జోక్యాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ఇకనైనా తన పోకడలు మార్చుకోవాలి అన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల, త్రిపురాంతకంలో హిందూ దళిత, గిరిజనులపై దాడులు జరిగాయి. గతంలో క్రైస్తవులు వారి ప్రార్థనలు వారు చేసుకునే వారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ మద్దతుతో క్రైస్తవులు తిరగబడుతున్న వైఖరిని బీజేపీ ఖండిస్తోంది అని పేర్కొన్నారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదు : సోము వీర్రాజు
