ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరో లేఖ రాశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వానికి అనేక అంశాలపై లేఖలు రాస్తూ వచ్చిన ఆయన.. ఈ సారి కోడిగుడ్ల నాణ్యతను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే కోడిగుడ్లల్లో నాణ్యత లేదని లేఖలో పేర్కొన్నా సోము వీర్రాజు.. కుళ్లిపోయిన కోడిగుడ్లను ఇవ్వడం వల్ల పిల్లలకు వాంతులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.. పౌష్టికాహార లోపాన్ని నివారించేలా కేంద్రం తగినంతగా నిధులిస్తున్నా.. నాణ్యత కలిగిన కోడిగుడ్లను ఎందుకు సరఫరా చేయడం లేదని ప్రశ్నించిన ఆయన.. పథకాల పేర్లు మార్చడం కాదు.. నాణ్యతతో కూడిన కోడిగుడ్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.. కోడిగుడ్ల సరఫరా వెనుక వైసీపీ నేతల హస్తముంది కాబట్టే కుళ్లిన గుడ్లను పంపిణీ చేస్తోన్నా అధికారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు సోము వీర్రాజు.
సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ.. కోడిగుడ్లలో నాణ్యత ఏది..?
