NTV Telugu Site icon

ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 26 బిల్లులకు ఆమోదం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారం… బీఏసీలో ప్రతిపక్షం అడిగిన విధంగా అసెంబ్లీ సమావేశాలు పొడిగించాం.. అయినా చర్చించటానికి అంశాలేమీ లేక టీడీపీ కావాలని డ్రామాలు ఆడి బయటకు వెళ్లి పోయిందని అధికార పార్టీ ఆరోపించింది… టీడీపీ అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని ప్రభుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి వెల్లడించారు.. అయినా ఎందుకు పారిపోయారో అర్థం కాలేదని మండిపడ్డారు.. మొత్తంగా ఏడురోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశల్లో 26 కీలక బిల్లులకు ఆమోదం లభించింది..

అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై ప్రసంగించిన సీఎం వైఎస్ జగన్‌.. రాష్ట్రంలో ప్రతి విద్యార్ధి చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 96 శాతం మంది తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మీడియం కోరుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. ఇక, ఏపీ అసెంబ్లీలోకి మొబైల్‌ ఫోన్లను తీసుకురావడంపై నిషేధం విధించారు.. సభలోకి సభ్యులు సెల్‌ఫోన్లు తీసుకురావొద్దని ప్రకటించారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. మొత్తంగా ఏడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగ్గా.. దాదాపు 35 గంటల సభ నిర్వహించారు. 28 కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది వైసీపీ సర్కార్.