Site icon NTV Telugu

Assembly Privilege Commitee: కూన రవిపై చర్యలు తప్పవా?

ఏపీ అసెంబ్లీలో సమావేశం అయింది ప్రివిలేజ్ కమిటీ (Privilege Commitee). కమిటీ ముందు హాజరయ్యారు టీడీపీ నేత కూన రవి కుమార్. ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. గతంలో స్పీకర్ పై ఆరోపణలు చేసిన కూన రవికుమార్ పై విచారణ జరిపాం అనీ, గతంలో వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పాం. అప్పుడు ఆయన రాలేదు. ఈరోజు వ్యక్తిగతంగా హాజరయ్యారని ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధనరెడ్డి చెప్పారు.

https://ntvtelugu.com/botsa-satyanarayana-strongs-allegations-on-tdp/

కూన రవి కుమార్ చేసిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్నాం అనీ, ఆరోపణల పై రవికుమార్ నుండి వివరణ తీసుకున్నాం అన్నారు. రవికుమార్ ఇచ్చిన వివరణను గోప్యంగా ఉంచుతాం. దీనిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం అన్నారు. పెండింగ్‌లో ఉన్న అంశాలన్నిటి పై చర్చిస్తున్నాం. ప్రివిలేజ్ కమిటీ ఎదుట ఉన్న పిటిషన్లు అన్నీ పరిష్కరిస్తున్నాం అని చెప్పారు కాకాణి.

స్పీకర్ పై ఆరోపణలు చేసిన కూన రవి

గతంలో ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌. తనపై తప్పుడు కేసులు పెట్టిన సీతారాంను భవిష్యత్‌లో ఆముదాలవలస నడిరోడ్డుపైన… పరిగెట్టిస్తానన్నారు. దీంతో పాటు పలు కామెంట్లు చేయడంతో ఆయనపై స్పీకర్ తమ్మినేని సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారం ప్రివిలేజ్ కమిటీ వరకూ వెళ్ళింది.

Exit mobile version