NTV Telugu Site icon

AP Assembly Live: ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌ అప్‌డేట్స్

Maxresdefault

Maxresdefault

AP Assembly Live | CM YS Jagan | Three Capitals Issue | Ntv Live

The liveblog has ended.
  • 15 Sep 2022 05:32 PM (IST)

    విశాఖ అభివృద్దిని అడ్డుకుంటున్నారు

    చంద్రబాబు విశాఖను ఎందుకు అభివృద్ది చేయలేదు. అమరావతిలో తమ బినామీల భూముల విలువ పెరగాలని ఆ పనిచేయలేదు. ఈ ప్రాంతంలో రకరకాల డ్రామాలు జరుగుతున్నాయి. అమరావతి: కట్టని రాజధాని గురించి, కట్టలేని అమరావతి గురించి వెయ్యి రోజులుగా కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.. విశాఖ అభివృద్దిని చంద్రబాబు అడ్డుకుంటున్నారన్నారు సీఎం జగన్

  • 15 Sep 2022 05:20 PM (IST)

    డ్రామాలు చేస్తే గ్రాఫిక్స్ మిగులుతాయి-సీఎం జగన్

    ఏపీలో చిత్తశుద్ధితో పనిచేయాలి. వికేంద్రీకరణ ద్వారానే ఫలితాలు వస్తాయి. 14 ఏళ్ళు సీఎంగా, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకి ఇప్పుడున్న వ్యవస్థల గురించి ఆలోచన ఎందుకు రాలేదన్నారు. వాలంటరీ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు, మన గ్రామంలోనే సచివాలయాలు ఏర్పాటుచేశాం. అమరావతి ప్రాంతంలో ఎవరు ఉద్యమాలు చేస్తున్నారు. హైదరాబాద్ కంటే మన రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు డెవలప్ కావాలి. గ్రామాల్లో ఇంటర్నెట్ అమలవుతోంది. 75 ఏళ్ళలో 2 జిల్లాలు ఏర్పాటుచేస్తే.. 13 జిల్లాలు వుంటే 13 జిల్లాలు ఏర్పాటుచేశాం. ఇదే డీసెంట్రలైజేషన్ అంటే.. కుప్పంలో రెవిన్యూ డివిజన్ పెట్టమని నాకు లెటర్ రాశారు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఏ గాడిదలు కాస్తున్నారు. కుప్పం ప్రజల వత్తిడి వల్ల నన్ను అడక్క తప్పలేదు. చంద్రబాబు చెప్పే మాటలకు అర్థం వుందా? పరిపాలన వికేంద్రీకరణ వల్ల ఎంతటి ఫలితాలు వస్తాయో గోదావరి వరదల కాలంలో చూశాం. భారీ వరదలు వస్తే ప్రజల్ని అన్ని వ్యవస్థలు ఎలా ఆదుకున్నాయో చూశాం. అటువంటి పరిస్థితుల్లో కేవలం వికేంద్రీకరణ వల్ల బియ్యం, కందిపప్పు, పామాయిల్, ఉల్లిపాయలు, టమోటాలు, రెండువేల సాయం అందించాం. ఏ ఒక్క కుటుంబానికి అందలేదని ఒక్కరు కూడా చెప్పకపోవడం. పారదర్శకంగా, వేగంగా అందజేయగలిగాం. గ్రామవార్డు, సచివాలయాలు, వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారో చూశాం.

  • 15 Sep 2022 05:00 PM (IST)

    విజయవాడకు బాబు ఏం చేశారు?

    బాబు చేయలేదు.. ఎవరూ చేయలేని దానిని మనం చేయాల్సిందేనని డ్యాన్స్ లు, ధర్నాలు చేస్తున్నారు. మనమీద దుర్బుద్ధితో డ్రామాలాడుతుంటే ప్రజలు ఆలోచించాలి. విశాఖను పక్కన పెడదాం.. ఇదే విజయవాడకు ఏం చేశారో అడుగుదాం. మన ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాంత అభివృద్ధి మీద ఎంత శ్రద్ధ పెట్టామో అందరికీ తెలియాల్సి వుంది. వెస్ట్రన్ బైపాస్ నడుస్తోంది. గన్నవరం చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకూ రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం. 17 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. 65 శాతం నిధులు ఖర్చుచేశాం. ఐదేళ్ళలో విజయవాడకు ఎందుకు చేయలేకపోయారని సీఎం జగన్ ప్రశ్నించారు.

     

  • 15 Sep 2022 04:57 PM (IST)

    ప్రతి ప్రాంతం బాగుండాలి..అమరావతిపై కోపం లేదు

    పరిపాలన వికేంద్రీకరణపై సీఎం జగన్ మాట్లాడారు. ప్రతిప్రాంతం బాగుండాలని, అమరావతిపై తనకేం కోపం లేదన్నారు సీఎం జగన్. చంద్రబాబు హయాంలో దోచుకో, పంచుకో, తీసుకో అనే డీపీటీ పథకం అమలైంది. ఒకటే రాజధానిగా అమరావతి సాధ్యమయ్యే పనేనా? అన్నారు. అమరావతి ప్రాంతంలో ఎవరు కొంటారు. ఎకరా 10 కోట్లకు ఎవరు కొంటారని మీరే అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని ఎలా అవుతుంది. తాను అభివృద్ది చేయని, చేయలేని ప్రాంతంలో చంద్రబాబు ఉద్యమాలు చేస్తున్నారు. వీళ్ళ దృష్టిలో అమరావతి ఒకటే రాజధాని ఎలా అవుతుంది. విశాఖలో రోడ్లు వున్నాయి.. డ్రైనేజీ, కరెంట్ వుంది.. విశాఖపై నాకేం ఎక్కువ ప్రేమ లేదు.. ప్రజలందరిపై ప్రేమ వుంది. విశాఖ ఏపీలో బిగ్గెస్ట్ సిటీ. అమరావతికి లక్షల కోట్లు ఎలా ఖర్చుపెట్టగలం. 10వేల కోట్లు పెడితే విశాఖ డెవలప్ అవుతుందన్నారు సీఎం జగన్.

  • 15 Sep 2022 04:10 PM (IST)

    టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కి ముందు సభలో టెన్షన్

    ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యుల సస్పెన్షనుకు ముందు సభలో టెన్షన్ ఏర్పడింది. పొడియం ముందున్న టీడీపీ సభ్యులను ఛైర్లల్లో కూర్చొపెట్టేందుకు ప్రయత్నించారు మార్షల్స్.సభలో సభ్యులపై చేయి వేసే అధికారం మార్షల్సుకు లేదంటూ టీడీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్సుపై విరుచుపడ్డ టీడీపీ ఎమ్మెల్యేలు.. పలువురు మార్షల్సును తోసేశారు టీడీపీ సభ్యులు.ఛైర్లల్లో కూర్చునేందుకు టీడీపీ సభ్యులు నిరాకరించడంతో సస్పెన్షన్ చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

  • 15 Sep 2022 03:55 PM (IST)

    డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్

    ఇవాళ, రేపో డెప్యూటీ స్పీకర్ ఎన్నికపై నోటిఫికేషన్ ఇవ్వనున్న అసెంబ్లీ సెక్రటరీ...ఇవాళ ఉదయం తన పదవికి రాజీనామా సమర్పించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి.

  • 15 Sep 2022 03:42 PM (IST)

    శివరామకృష్ణన్ కమిటీ నివేదిక పక్కకు పెట్టారు

    అభివృద్ధి వికేంద్రీకరణను పక్కన పెట్టి అప్పటీ సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్ర రాజధాని నిర్ణయానికి ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కన పెట్టారు. రియల్ ఎస్టేట్ కోసం మంత్రి నారాయణ కమిటీని వేశారన్నారు మాజీ మంత్రి కన్నబాబు. అమరావతి విషయంలో చంద్రబాబు అంతన్నాడు.. ఇంతన్నాడు అనే సామెతను ఉదహరించారు. తాత్కాలిక నిర్మాణాలు చేసి ఇదే మహా రాజధాని అని నమ్మించే ప్రయత్నం చేశారు. కేవలం కొంతమంది కోసమే అన్నట్టుగా వ్యవహరించారు.

  • 15 Sep 2022 03:37 PM (IST)

    టీడీపీ సభ్యుల సస్పెన్షన్

    అమరావతి: అసెంబ్లీ నుంచి ఒకరోజు 16 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. సభ సజావుగా సాగేందుకు సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. సభ ఆమోదం..

  • 15 Sep 2022 03:19 PM (IST)

    ఇది ప్లాన్ ప్రకారం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం

    అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందనే భావనతోనే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు భూములు కొనుగోలు చేశారన్నారు మంత్రి బుగ్గన. కొంతమంది వ్యక్తులు మాత్రమే భూములు కొనడం ఏంటి? అమరావతి విషయంలో జరిగింది అందరికీ తెలుసన్నారు ఆర్థికమంత్రి బుగ్గన.

  • 15 Sep 2022 03:14 PM (IST)

    భూముల కొనుగోలుపై బుగ్గన ప్రకటన

    రాజధాని నాగార్జున వర్శిటీ అన్నారు.. తర్వాత నూజివీడు అన్నారు..అక్కడ జనం భూములు కొనుక్కుంటే.. ఈ టైంలో అమరావతిలో భూములు కొనుక్కున్నారు. రాజధాని ప్రాంతంలో భూములు ఎవరు కొనుగోలు చేశారో వివరించిన బుగ్గన. పెదకాకాని, కంతేరు, తాడికొండ.. లలో హెరిటేజ్ ఫుడ్స్, పయ్యావుల హారిక కొనుగోలు చేసిన భూములు వివరించిన బుగ్గన.

  • 15 Sep 2022 03:10 PM (IST)

    దమ్ముంటే బినామీ చట్టం అమలుచేయండి.. పయ్యావుల

    అమరావతి భూముల వివాదంపై అసెంబ్లీలో చర్చ. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ కేసులు పెట్టారు.. కోర్టు ద్వారా చీవాట్లు తిన్నా మీరు మారలేదు. ఎస్సీ భూముల కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు పట్టించుకోలేదు. సీఎం ప్రకటన తర్వాతే నేను భూములు కొన్నాను. భూములు కొంటే తప్పేంటి? అసెంబ్లీలో వికేంద్రీకరణ బిల్లుపై చర్చలో ఆర్థికమంత్రి బుగ్గనకు పయ్యావులకు మధ్య మాటల యుద్ధం.. 4-9-2014 న రాజధాని ప్రకటన చేశారు. నేను సెప్టెంబర్ నెలలో కొన్నాను. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేసులు ఎందుకు విత్ డ్రా చేసుకున్నారని పయ్యావుల ప్రశ్న.

  • 15 Sep 2022 02:24 PM (IST)

    మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే వీకేంద్రీకరణ

    16 వేల గ్రామాల్లో సచివాలయాలు పెట్టిన వ్యక్తి సీఎం జగన్. గ్రామ సచివాలయాలతో లక్షలాది మందికి ఉద్యోగాలొచ్చాయి. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదు. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. 40 ఆలయాలు కూల్చిన చంద్రబాబు.. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నాడు: కొడాలి నాని

  • 15 Sep 2022 02:20 PM (IST)

    సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌దే

    సచివాలయ వ్యవస్థను ప్రజలకు చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌దే. గ్రామ సచివాలయాలతో ప్రజలకు పాలన మరింత చేరువ అయ్యింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత దగ్గరైంది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేశాం. అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం గొప్ప ఆలోచన: భూమన కరుణాకర్ రెడ్డి

  • 15 Sep 2022 10:33 AM (IST)

    సభలో ఆగని టీడీపీ ఆందోళన..

    అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభం అయ్యింది అసెంబ్లీ.. అయితే, మళ్లీ స్పీకర్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు.. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.. జాబ్‌ క్యాలెండర్‌, నిరుద్యోగ సమస్యపై చర్చించాలని డిమాండ్‌ చేస్తున్నారు

  • 15 Sep 2022 09:40 AM (IST)

    ఇంటికో ఉద్యోగంపై మాట్లాడుదాం.. స్పీకర్ సెటైర్లు

    నిరుద్యోగ సమస్యపై శాసన సభలో చర్చకు పట్టుబట్టిది టీడీపీ.. జాబ్ క్యాలెండరుపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీఎల్పీ... రాష్ట్రంలో ప్రధాన సమస్యగా ఉన్న నిరుద్యోగంపై చర్చకు అనుమతించాలని డిమాండ్‌ చేసింది.. జాబ్ క్యాలెండర్ ఎక్కడ అంటూ నినాదాలు చేశారు.. అయితే, టీడీపీ సభ్యుల అభ్యర్థనను తోసి పుచ్చిన స్పీకర్... జాబ్ క్యాలెండర్‌తో పాటు ఇంటింటికీ ఉద్యోగం అంశంపైనా మాట్లాడుదాం అంటూ వ్యాఖ్యానించారు.

  • 15 Sep 2022 09:29 AM (IST)

    జాబ్‌ క్యాలెండర్‌పై టీడీపీ పట్టు..

    జాబ్ క్యాలెండర్‌పై ఏపీ అసెంబ్లీలో చర్చకు పట్టుపట్టారు టీడీపీ సభ్యులు.. స్పీకర్ పోడియం దగ్గరకు చేరుకుని నినాదాలు చేశారు.. స్పీకర్ పోడియం ఎక్కి ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.

  • 15 Sep 2022 09:24 AM (IST)

    చంద్రబాబు అండ్‌ కో రాజకీయ నిరుద్యోగులు..!

    చంద్రబాబు నాయుడు అండ్‌ కో రాజకీయ నిరుద్యోగులుగా మారారు.. దీంతో సభలో ఆందోళనకు దిగారంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి జోగి రమేష్.. సభలో టీడీపీ సభ్యులు ఆందోళనపై ఘాటుగా స్పందించిన ఆయన.. చర్చకు రాకుండా.. స్పీకర్‌ పోడియం వద్ద ఆందోళన చేయడం ఏంటి అని మండిపడ్డారు. టీడీపీ పని అయిపోయింది.. ఇక, మీకు శవయాత్రే నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

  • 15 Sep 2022 09:21 AM (IST)

    సవాల్‌ చేసి సభను అడ్డుకుంటారా?

    దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలంటూ సవాల్‌ విసిరిన తెలుగుదేశం పార్టీ నేతలు.. ఇప్పుడు అసెంబ్లీ ప్రారంభం కాగానే సభను అడ్డుకుంటోంది ఫైర్‌ అయ్యారు ప్రభుత్వ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి.. అసలు బీఏసీ సమావేశం నిర్వహించక ముందే టీడీపీ ఆందోళన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • 15 Sep 2022 09:18 AM (IST)

    స్పీకర్‌ పోడియం దగ్గరకు టీడీపీ సభ్యులు..

    నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ.. సభ ప్రారంభం అయిన వెంటనే చర్చకు పట్టుబట్టింది.. స్పీకర్‌ పోడియం దగ్గరకు వెళ్లిన నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు..

  • 15 Sep 2022 09:16 AM (IST)

    సభలో టీడీపీ ఆందోళన..

    ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. ఆ వెంటనే సభలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు.. నిరుద్యోగ సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చిన టీడీపీ.. దాని కోసం పట్టుబడుతో సభలో నిరసన చేపట్టింది..