NTV Telugu Site icon

AP Assembly: ఐదు బిల్లులు, రెండు కీలక తీర్మానాలకు ఆమోదం..

Ap Assembly

Ap Assembly

AP Assembly: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాల్లో వరుసగా బిల్లులను ప్రవేశపెడుతూ వస్తోంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఇక, అన్ని బిల్లులకు ఆమోదం లభిస్తోంది.. ఇవాళ సభలో రెండు అప్రాప్రియేషన్ బిల్లులతో సహా ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం.. ఐదు బిల్లులను శాసనసభ ఆమోదించింది. మరోవైపు.. రెండు తీర్మానాలను సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం.. బోయ/వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేశారు.. తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.. క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిన దళితులను ఎస్సీలుగా పరిగణించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానం చేసింది ఏపీ అసెంబ్లీ.. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున.. ఐదు బిల్లులతో పాటు.. ప్రభుత్వం ఈ రోజు సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులను కూడా ఏకగ్రీవంగా ఆమోదించింది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ.. ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపించనుంది ప్రభుత్వం.

Read Also: Manchu Vishnu: మనోజ్ తో గొడవ.. ఎట్టకేలకు స్పందించిన మంచు విష్ణు