NTV Telugu Site icon

అంత‌ర్వేదిలో అల్ల‌క‌ల్లోలంగా స‌ముద్రం…దుకాణాలు నేల‌మ‌ట్టం…

తూర్పుగోదావ‌రి జిల్లా స‌ఖినేటిప‌ల్లి మండ‌లంలోని అంత‌ర్వేదిలో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది.  పెద్ద ఎత్తున స‌ముద్రంలో అల‌లు ఎగ‌సిప‌డుతున్నాయి.  దీంతో స‌ముద్రం 15 మీట‌ర్ల మేర ముందుకు వ‌చ్చింది.  అల‌లు పెద్ద ఎత్తున ఎగ‌సిప‌డ‌టంతో పాటుగా స‌ముద్రం ముందుకు చొచ్చుకు రావ‌డంతో బీచ్ లో ఉన్నా దుకాణాలు నేల‌మ‌ట్టం అయ్యాయి.  స‌ముద్రం ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌లు చెందుతున్నారు.  గ‌త కొన్ని రోజులుగా వాతావ‌ర‌ణంలో అనూహ్య‌మైన మార్పులు చోటుచేసుకుంటుండ‌టంతో స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారిన‌ట్టు వాతావార‌ణశాఖ పేర్కొన్న‌ది.  మ‌త్స్య‌కారులు చేప‌ల వేట‌కు వెళ్లోద్ద‌ని అధికారులు హెచ్చిరిస్తున్నారు.  

Read: వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ!