NTV Telugu Site icon

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

Bay Of Bengal

Bay Of Bengal

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. ఇవాళ అల్పపీడనంగా మారనుంది.. ఆ తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా ఈ అల్పపీడనం మూడు రోజులపాటు నెమ్మదిగా కదులుతుందని అంచనా వేసింది భారత వాతావరణ విభాగం (ఐఎండీ).. ఇక, ఈ అల్పపీడనం ప్రభావంతో.. ఈ నెల 29, 30 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని.. ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.. మరో వైపు ఉత్తర కోస్తా, రాయలసీమల్లో చలి తీవ్రత కొనసాగుతోంది.. అల్లూరి జిల్లా పాడేరులో ఇవాళ 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.. మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. కనిష్ట ఉష్ణోగ్రతల క్షీణత కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజుల నుంచి ఏజెన్సీ ఏరియాతోపాటు రాయలసీమలో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి.

Read ALso: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌