NTV Telugu Site icon

ఏపీకి మరో 9 లక్షల కరోనా టీకా డోసులు..

ఏపీకి మరో 9 లక్షల కొవిడ్ టీకా డోసులు తరలివచ్చాయి. పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి కొవిషీల్డ్ టీకా డోసులు. దిల్లీ నుంచి చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో 75 బాక్సుల్లో టీకా డోసులు రాష్ట్రానికి తరలివచ్చాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ను తరలించారు అధికారులు.. అక్కడి నుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనుంది వ్యాక్సిన్.. తాజాగా చేరుకున్న కొవిడ్ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం కలుగనుంది. కాగా ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 87,756 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 6617 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 57 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 10,567 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 18,23,856 కు చేరుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 12,109 మంది మృతిచెందారు.. రిక‌వ‌రీ కేసులు 17,40,281 కు పెర‌గ‌గా.. ప్ర‌స్తుతం 71,466 యాక్టివ్ కేసులు ఉన్నాయి.